ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా తెరకెక్కిన `ఫస్ట్ డే ఫస్ట్ షో` ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెళ్లారు ముఖ్య అతిధిగా వెళ్లారు చిరంజీవి. ఈ సందర్భంగా తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ రాము సినిమా అంటే తనకు వణుకుపుడుతుందని అన్నారు చిరు. అంత వణుకు పుట్టించే ఫ్లాష్ బ్యాక్ ఏమిటో స్వయంగా చెప్పారు చిరు.
”ఏవీఎం వారి ఎన్టీఆర్ గారు నటించిన ‘రాము’ చిత్రం నెల్లూరు లో మా చుట్టాలు అబ్బాయితో కలసి ఫస్ట్ ఫస్ట్ షో చూడటానికి వెళ్ళా. నేల టికెట్ కి తీసుకెళ్ళాడు. నాగబాబుని తీసుకొని క్యూలో నడుస్తుంటే మధ్యలో క్యూ ఆగిపోయింది. ఇరుకుగోడలు. ఊపిరాగిపోయినంత పనైయింది. ఎదో రకంగా టికెట్ తీసుకొని బయటికి వస్తే.. మా నాన్న ఎదురుగా కనిపించారు. వెనుక అమ్మ వుంది. అంతకుముందు షో ఆయన చూశారు. నేల టికెట్ లో సినిమా చూస్తావా ? అని కొబ్బరి మట్ట తీసి చెత్తకింద కొట్టారు. రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. ఇప్పటికీ రాము సినిమా పేరు వింటే వణుకు పుడుతుంది” అని చెప్పుకొచ్చారు చిరు.