తెలుగు సినిమాకు నాలుగు స్థంభాల్లాంటి స్టార్ హీరోల నలుగురు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. మిగతా హీరోలు ఎంతమంది ఉన్నా 80-90ల నుండి స్టార్స్ గా కొనసాగి తెలుగు సినిమా స్టామినాను దశ దిశలా తెలిసేలా చేశారు. అయితే అప్పట్లో నెంబర్ వన్ ఎవరు అంటే ముక్తకంఠంతో మెగాస్టార్ అనేవారు. ఆ తర్వాతే బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు వచ్చేవారు. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికి సేమ్ ఉన్నా మొదట చిరుకే పట్టం కట్టేవారు.
అయితే రోజులు మారాయి.. చిరు సడెన్ గా రాజకీయంలోకి వెళ్ళారు. బాలయ్య తన మూస ఫార్ములానే కంటిన్యూ చేస్తూ కొద్ది కొద్దిగా క్రేజ్ తగ్గించుకుంటూ వచ్చారు. ఈ మధ్య కాస్త పర్వాలేదనిపించుకున్నా మళ్లీ అదే ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక దగ్గుబాటి హీరో వెంకటేష్ తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఈ మధ్య కాస్త వెనుక పడ్డాడు. అయితే అప్పట్లో నలుగురిలో నాలుగో వాడుగా ఉన్న నాగ్ ఇప్పుడు దుమ్ము దులిపేస్తున్నాడు.
ఆ నలుగురు పెద్ద స్టార్ హీరోల్లో ఇప్పుడు క్రేజ్ ఎవరికి ఎక్కువగా ఉంది అంటే అది కచ్చితంగా నాగ్ కే.. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ ఇలా స్క్రీన్ ఏదైనా మన కింగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాడు. ఇక స్టార్ హీరోలకు కూడా సొంతం కాని 50 కోట్ల మార్క్ ను తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో క్రాస్ చేసి అది లెక్క అని తేల్చి పారేశాడు. మరి ఇలా చూస్తే నాగ్ ను బీట్ చేయడం ఇప్పుడు ఆ పెద్ద స్టార్స్ మొదటి టార్గెట్ అని చెప్పాలి.
ముఖ్యంగా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ముందు తేల్చుకోవాల్సిన లెక్క ఇదే.. చిరు సినిమా నాగ్ సినిమాను బీట్ చేస్తేనే మెగాస్టార్ అనిపించుకోగలడు.. తన సత్తా ఏం తగ్గలేదని నిరూపించుకోగలడు. ఒకవేళ చిరు ఆ 50 కోట్ల టార్గెట్ క్రాస్ చేయలేకపోతే నాగ్ నెంబర్ వన్ అని ఒప్పుకోవాల్సిందే మరి. అయితే ఈ టార్గెట్ దృష్టిలో ఉంచుకునే చిరు తన సినిమా కోసం అంత కష్టపడుతున్నాడని తెలుస్తుంది. మరి చిరు నాగ ల మధ్య నడుస్తున్న ఈ పోరులో ఎవరు నెగ్గుతారు అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు సిని జనాలు.