చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా వచ్చేసిందని, స్వల్ప లక్షణాలతో కరోనా బారీన పడ్డానని, హోం క్వారెంటైన్లో ఉన్నానని చిరు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనని కలిసినవాళ్లంతా విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. చిరు ఇటీవలే `భోళా శంకర్` షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరుకి కరోనా సోకడంతో టీమ్ లో కంగారు మొదలైంది. దాదాపు ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందే. ఇటీవల తన నివాసంలో చాలామంది దర్శకుల్ని కలిశారు చిరు. వాళ్లూ టెస్టులకు రెడీ అయిపోవాల్సిందే. ఇది వరకు కూడా చిరుకి కరోనా సోకింది. అయితే… అప్పట్లో రిపోర్టులు తారుమారు అయ్యాయని, తనకు కరోనా రాలేదని చిరు ఆ తరవాత తెలుసుకున్నారు.