ఈమధ్యే ట్విట్టర్లోకి వచ్చిన చిరంజీవి… ఈ లాక్ డౌన్ సమయంలో ట్విట్టర్లో చురుగ్గా స్పందిస్తున్నారు. సరదా విషయాల్ని, తన జ్ఞాపకాల్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు.. కరోనా విషయంలో జనాల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈరోజు కూడా చిరు నుంచి ఓ వీడియో వచ్చింది. ఇలాంటి క్లిష్టతరుణంలో కష్టపడుతున్న పోలీసులకు చిరు సెల్యూట్ చేశారు. వాళ్ల పనితనాన్ని మెచ్చుకున్నారు. ఓ పోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నా…. అంటూ ఉద్వేగంగా చెప్పారు.
”రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వాళ్ల పనితీరు వల్లే లాక్ డౌన్ విజయవంతమైంది. అలా జరగబట్టే కరోనా విజృంభణ చాలా వరకూ అదుపులోకి వచ్చింది. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలి. వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలి. పోలీసు వాళ్లు చేసుస్తున్న ఈ అమోఘమైన ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వాళ్లకు సెల్యూట్ చేస్తున్న”` అని పేర్కున్నారు చిరు.
#SalutingCoronaWarriors @TelanganaDGP @TelanganaCOPs #UnitedAgainstCorona pic.twitter.com/9LOFWD9irk
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2020