మెగాస్టార్ చిరంజీవికి కేంద్రప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో నిర్వహించనుంది. భారత్ ను అంతర్జాతీయ వినోద కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై మోదీ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, ఎంటర్టెయిన్మెంట్ ఇండస్ట్రీ ప్రముఖులతో మోదీ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. వేవ్స్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం కోసం వారి సలహాలు, సూచనలను మోదీ స్వీకరించారు.
చిరంజీవిని వేవ్స్ అడ్వైజరీ బోర్డులో మెంబర్ గా కేంద్రం చేర్చింది. ఇలా గౌరవం ఇచ్చినందున ప్రధాని మోదీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని మోదీ ‘వేవ్స్’ గురించి చేసిన పోస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ) అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం, ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి పని చేయడం నిజంగా ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు మోడీ జీ మానసపుత్రిక అయిన వేవ్స్ భారతదేశం సాఫ్ట్ పవర్ ని ప్రపంచంలో నెక్స్ట్ లెవెల్ కు నడిపిస్తుందనే విషయం ఎలాంటి సందేహం లేదన్నారు.
వేవ్స్ సమ్మిట్ – 2025 సీజన్ 1ను కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుంచి 9 మధ్య నిర్వహించబోతున్నారు. వచ్చే నవంబర్లో గోవాలో ఇది అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో కలిపి ఈ సమ్మిట్ జరగనుంది.