టాలీవుడ్‌కి ఇప్పుడు చిరంజీవి `అతిథి` పాత్ర పోషిస్తున్నాడు. మెగా హీరోల సినిమా ఫంక్షన్ అంటే చిరంజీవినే గుర్తొస్తున్నారు. చరణ్ ఆడియో ఫంక్షన్లకు చిరు వెళ్లాల్సిందే. బన్నీ పిలిచినా మొహమాటమే. సాయిధరమ్ తేజ్, వరుణ్తేజ్లనూ కాదనలేడు. ఇప్పుడు అల్లుడు కూడా వచ్చాడు. కల్యాణ్ `విజేత` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ ఆడియో ఫంక్షన్‌కి కూడా చిరంజీవినే ముఖ్య అతిథి. మామయ్యగా అల్లుడికి చిరు సపోర్ట్ ఇవ్వాల్సిందే. నిజానికి పెళ్లి మాటల్లో ఇదే ప్రధానమైన షరతని.. అప్పట్లో చెప్పుకున్నారు. వారాహి సంస్థే ఈ చిత్రానికి అఫీషియల్ నిర్మాత అయినా.. డబ్బులు సమాకూరుస్తోంది మాత్రం మెగా ఫ్యామిలీనే అనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నాడు. కేవలం ఫ్యామిలీ హీరోల ఫంక్షన్లకు వెళ్తే బాగోదని – అప్పుడప్పుడూ మిగిలిన వాళ్ల ఫంక్షన్లలో మెరవడం తప్పని సరి. ఒకప్పుడు ఏ ఆడియో ఫంక్షన్ చూసినా దాసరి నారాయణరావు కనిపించేవారు. ఇప్పుడు ఆ ప్లేసులో చిరంజీవి కనిపించబోతున్నాడు. అంతే తేడా. ఇక నుంచి ఆడియో ఫంక్షన్లలో చిరు ఎంట్రీ చూసీ చూసీ బోర్ కొట్టినా కొట్టొచ్చు. మెగా ఫ్యాన్స్ కి మాత్రం వారానికి ఓసారి చిరంజీవిని కళ్లారా చూసుకునే ఛాన్సుంది.