చిరు ఇంటికి ప‌వ‌న్‌… మెగా సంబ‌రాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అపూర్వ విజ‌యం సాధించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, తొలిసారి చిరంజీవిని క‌లుసుకొన్నారు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ప‌వ‌న్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ప‌వ‌న్ ని చిరు కుటుంబం పూల వ‌ర్షంతో ఆహ్వానం ప‌లికింది. ప‌వ‌న్ ని చూడ‌గానే అంద‌రి క‌ళ్ల‌ల్లో ఆనందం, క‌న్నీటి భాష్షాలు. ఆ మూమెంట్ ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. చిరు రాగానే ప‌వ‌న్ పాదాభివందనం చేయ‌డం, ఆ త‌ర‌వాత చిరు త‌మ్ముడ్ని ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకోవ‌డం – మెగా అభిమానుల‌కు క‌న్నుల పండుగ‌లా క‌నిపించిన దృశ్యం. అమ్మ‌, వ‌దిన‌ల కాళ్ల‌కు సైతం దండం పెట్టి, వాళ్ల ఆశీర్వ‌చ‌నాలు అందుకొన్నారు ప‌వ‌న్‌. వ‌దిన అంటే ప‌వ‌న్‌కు చాలా అభిమానం. వాళ్లిద్ద‌రిదీ ప్ర‌త్యేక‌మైన అనుబంధం. అది ఈ సంద‌ర్భంలో మ‌రింత అందంగా సాక్షాత్క‌రించింది. ప‌వ‌న్‌ని గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు చిరు. అనంత‌రం కేక్ కూడా క‌ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. ప‌వ‌న్ తో పాటుగా భార్య అన్నా, త‌న‌యుడు అకీరా కూడా ఉన్నారు. ఈనెల 12న చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉంది. ఈ వేడుక‌కు చిరు కూడా హాజ‌ర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close