కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `రంగమార్తండ`. ప్రకాష్ రాజ్ కీలక పాత్రధారి. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా కోసం చిరు తన వంతు సాయం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన గాత్రదానం చేశారు. కొన్ని కవితాత్మక పంక్తులు చిరు గొంతు నుంచి వినిపించనున్నాయి. చిత్ర ప్రారంభంలో, చివర్లో.. చిరు గొంతు పద్య కవిత ద్వారా వినిపిస్తారు.
ఈ పంక్తుల్ని ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల రాశారు. రంగస్థల నేపథ్యంలో సాగే చిత్రం రంగమార్తాండ. కళాకారుల జీవితాల్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. నటుడి జీవితాన్ని ఈ గద్య కవిత ద్వారా ఆవిష్కరించబోతున్నారు. అవన్నీ చిరు గొంతులో వినిపిస్తే బాగుంటుందన్నది కృష్ణవంశీ ఆలోచన. చిరుకీ కృష్ణవంశీకి మంచి అనుబంధం ఉంది. అందుకే కృష్ణవంశీ అడిగిన వెంటనే.. చిరు ముందుకొచ్చి తన వంతు సాయం చేశారు. రంగమార్తండ సినిమాకి చిరు వాయిస్ ఓ ప్లస్ పాయింట్ కాబోతోంది.