మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడా అన్న కన్ ఫ్యూజన్ కు ఇంకా తెరపడలేదు. మొన్నామధ్య కత్తి రీమేక్ చేస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నా.. మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడని అంటున్నారు. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ సీక్వెల్ మున్నాబాయ్ ని ఇక్కడ మూడో భాగం తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్. మున్నాబాయ్ సీరీస్ లను ఇక్కడ శంకర్ దాదా MBBS, శంకర్ దాదా జిందాబాద్ అంటూ తీసిన మెగాస్టార్ ఆ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు.
అయితే కెరియర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకున్న చిరు మరోసారి అలాంటి కామెడీ ఎంటర్టైనర్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం కత్తి, మున్నాబాయ్ ఈ రెండీట్లో ఏ సినిమా చేయాలనే సదిగ్ధంలో పడ్డాడు చిరంజీవి. మొన్నీమధ్యే రీ ఎంట్రీగా బ్రూస్ లీలో అలా వచ్చి ఇలా వెళ్లిన చిరు స్క్రీన్ ప్రెజెన్స్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.
కత్తి అయితే సోషల్ మెసేజ్ తో కూడుకున్న సబ్జెక్ట్.. తన హోదాకు కరెక్ట్ గా సరితూగే కథ.. కొంచం కొత్తగా కూడా ఉంటుంది.. రీ ఎంట్రీగా అలాంటి సినిమా అయితేనే మెగాస్టార్ అదుర్స్ అనిపిస్తాడు. ఇక మున్నాబాయ్ రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్.. ఒకవేళ ఈ సినిమా చేసినా తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఫ్యాన్స్ ని అలరిస్తాడు చిరు. మరి ఈ రెండీటిలో ఏది ఫైనల్ అనేది త్వరలో తెలియనుంది. అయితే మున్నాబాయ్ పార్ట్ కథ రాసుకున్నా సంజయ్ దత్ జైల్లో ఉండటంతో ఆ సినిమా తీయడం కుదరలేదు. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టాడు హిరాణి మరి చిరు కోసం ఆ కథ అక్కడ తీయకుండా ఇక్కడకు ఇస్తాడో లేదో చూడాలి.