అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌లతో జోడీ కట్టింది తమన్నా. ఇప్పుడు చిరంజీవితోనూ ఆడి పాడబోతోందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది తమన్నా. ఇదో చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. కాబట్టి చిరు – తమన్నాలు జోడీగా నటించారని చెప్పలేం. ఈ సినిమాలో తమన్నాది ఓ పాత్ర అంతే. అయితే… చిరు 152వ చిత్రంలో మాత్రం చిరు, తమన్నాలను జోడీగా చూసే అవకాశం దక్కబోతోందని తెలుస్తోంది. చిరు తన 152వ చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. కథానాయిక పాత్ర కోసం తమన్నా పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరుతో సినిమా అంటే ఏ కథానాయిక అయినా ‘సై’ అనాల్సిందే. ‘రచ్చ’ ఆడియో ఫంక్షన్లో ‘తమన్నాతో కలసి నటించాలనివుంది’ అని చిరు…. ‘చిరుతో కలసి డాన్స్ చేయాలని వుంది’ అని తమన్నా తమ మనసులోని కోరికలు బయట పెట్టారు. ఇప్పుడు అవి రెండూ తీరబోతున్నాయి.