ఒకప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలలోకి వెళ్ళిన చిరంజీవి, రాజకీయాలలో కొనసాగుతూనే మళ్ళీ ‘కత్తి’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ‘కత్తి’ పట్టుకొనే ముందు చాలా కాలంగా ఇబ్బందిపెడుతున్న కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకొన్నారు. త్వరలో ఎడమ భుజానికి కూడా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోబోతున్నారు. త్వరలో ఆయన కుమార్తె శ్రీజ వివాహం జరుగబోతోంది. ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే చిరంజీవి ఆపరేషన్ చేయించుకొంటారు. ఆ తరువాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ‘కత్తి’ పట్టుకొంటారు. బహుశః దసరా, దీపావళి పండుగల సమయానికి ‘కత్తి’ నూరడం పూర్తవుతుందేమో?