”ఏప్రిల్ 8వ తారీఖుతో నాకు బోలెడంత అనుబంధం ఉంది” అంటూ… రెండ్రోజుల క్రితం ట్వీట్ చేశారు చిరంజీవి. ఏప్రిల్ 8 అంటే బన్నీ పుట్టిన రోజు. అందుకే చిరంజీవి ఆ ట్వీట్ చేశారేమో అనుకున్నారు ఫ్యాన్స్. ఏప్రిల్ 8తో చిరుకి ఉన్న మరో రకమైన అనుబంధం ఏమిటా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ సస్పెన్స్‌ని ఇప్పుడు చిరునే బద్దలు కొట్టారు.
ఈరోజు హనుమజ్జయంతి. చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు. శివ శంకర వర ప్రసాద్ పేరుని చిరంజీవిగా మార్చుకోవడం వెనుక.. ఉన్న కథ కూడా చిరంజీవి ఫ్యాన్స్‌కి తెలుసు. దానికి తోడు… ఓరోజు చిరంజీవికి లాటరీలో ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చిందట. ఆ బొమ్మని ఇప్పటికీ తన దగ్గరే పదిలంగా దాచుకున్నాడట చిరు. ఆ విషయమే చెబుతూ అప్పట్లో లాటరీలో వచ్చిన ఆంజనేయస్వామి బొమ్మని ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అంతే కాదు.. ఆ బొమ్మని చూపిస్తూ… ‘కనుబొమ్మలు, కళ్లు ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి` అని మా నాన్నగారు చెప్పారు’ అంటూ అప్పట్లో తన ఫొటోని కూడా షేర్ చేసుకున్నారు.
మరోవిశేషం ఏమిటంటే ఓసారి ప్రముఖ చిత్రకారుడు బాపు చిరంజీవి కోసం ఆంజనేయస్వామి చిత్రపటం గీసి బహుమతిగా పంపార్ట. పంపుతూ ఓ మాట కూడా అన్నార్ట. ‘అదేంటోనండీ బొమ్మను గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండీ. మార్చలేదు. అలానే ఉంచేశాను’ అన్నార్ట. ఓ చిత్రకారుడి నుంచి అలాంటి కాంప్లిమెంట్ రావడం గొప్ప విషయమే. అందుకే ఆ బొమ్మని సైతం పాల రాతిపై రీ ప్రొడ్యూస్ చేయించి అలానే ఉంచేశార్ట. అందుకే ఈ రోజుతో చిరుకి అంత అనుబంధం. అన్నట్టు ఈరోజు బన్నీ పుట్టిన రోజు కూడా. ఇదే విషయాన్ని చెబుతూ బన్నీతో తన చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ‘డాన్స్ లో గ్రేస్ ఆ వయసులోనే ఉంది. బన్నీలో ఆ కసి, ఆ కృషి నాకిష్టం’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదీ ఏప్రిల్ 8తో చిరుకి ఉన్న అనుబంధం.
ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో.. ..to be continued pic.twitter.com/HnpRnezH8E
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? pic.twitter.com/A2lqoazwcJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020