టాలీవుడ్ ప్రస్తుతం రచయితల కొరతతో అల్లాడుతోంది. స్టార్ రచయితలు దర్శకులిగా మారిపోతున్నారు. ఒకే ప్రాజెక్ట్ తో సంవత్సరాలు గడిపేస్తున్నారు. మిగాతా వాళ్ళు వున్నా స్టార్ హీరోలకు మెప్పించే కధలు రాసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ రాసిన ఆ కధలపై హీరోలకు గురి కుదరడం లేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కధల కొరతలోనే వున్నారు. తన రీఎంట్రీ చిత్రం కోసం దాదాపు రెండేళ్ళు కసరత్తులు చేశారు చిరంజీవి. ఇండస్ట్రీలో వున్న స్టార్ రైటర్లు, దర్శకులు చాలా కధలు వినిపించారు. అయితే ఆయనకు గురి కుదరలేదు. రిస్క్ అవసరమా అనుకున్నారు. చివరికి తమిళ సినిమా ‘కత్తి’ రిమేక్ రైట్స్ కొనుక్కొని సేఫ్ గా రీఎంట్రీ ఇచ్చారు.
ఇప్పడు ఆయనకు మళ్ళీ కధల సమస్య వచ్చిపడింది. ఖైదీ నెంబర్ 150తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు చిరంజీవి. సురేందర్ రెడ్డి తో ఓ సినిమా అనుకున్నారు. సూరి తన దగ్గర వున్న ఒక సబ్జెక్ట్ చెప్పాడు. కాని ఎందుకో ఆయనకు ఇంకా దానిపై గురి కుదరలేదు. అందుకే ‘ఉయ్యాలవాడ’ చరిత్ర ఆదరంగా సినిమా అనుకుంటారు. ఈ గ్యాప్ లో మరికొన్ని కధలు కూడా ఆయన దృష్టికి వచ్చాయి. కాని ఆయన దేనివైపు మొగ్గు చూపడం లేదు. ఇప్పుడు ఆయన ద్రుష్టి మళ్ళీ కోలీవుడ్ పై పడింది. తాజగా మహేష్ బాబు షూటింగ్ లొకేషన్ లో దర్శకుడు మురగదాస్ తో కలిసారు మెగాస్టార్. మహేష్ సెట్స్ లో చిరు అని ప్రచారం జరుగుతుంది కానీ మహేష్ బాబు షూటింగ్ చూడలనే సరదా ఏం లేదు చిరంజీవికి. ఆయన అక్కడికి వెళ్ళింది మురగదాస్ కోసమే. ఒక మంచి సబ్జెక్ట్ వుంటే చెప్పమని మురగదాస్ ని కోరారట చిరంజీవి. ఆయనా అందుకు ఓకే చెప్పారని వినిపిస్తుంది.
మురగదాస్ తో స్టాలిన్ చేశారు చిరు. అంతుకు ముందు చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన టాగూర్ మురగదాస్ స్టోరీనే. ఖైదీ నెంబర్ 150కి మూలం కూడా మురగదాసే. ఇప్పుడు మరోసారి తన కోసం సబ్జెక్ట్ రాయమని మురగదాస్ ను కోరేశారు మెగాస్టార్. చూస్తుంటే పక్క ఇండస్ట్రీ ట్యాలెంట్ పై వున్న గురి టాలీవుడ్ పై లేదనిపిస్తుంది మెగాస్టార్ కి.