రామ్‌చరణ్ సినిమా అంటే చిరంజీవి జోక్యం ఉండక తప్పదు. సినిమా కథేంటి? ఎవరిని తీసుకొంటున్నారు? ఎలా వస్తోంది? ఎంత ఖర్చవుతోంది? ఇలాంటి విషయాలపై చిరు ఓ కన్నేసి ఉంచుతారు. కొన్నిసార్లు ఈ పర్యవేక్షణ మంచే చేసింది. చిరు అనుభవం చరణ్‌కి బాగా పనికొచ్చింది. అయితే దర్శకులకు మాత్రం చిరు జోక్యం చేసుకోవడం తలనొప్పిగా మారుతోంది. రామ్‌చరణ్ సినిమా తని ఒరువన్ రీమేక్ విషయంలోనూ చిరు అత్యుత్సాహం కనబరుస్తున్నారని, అది సురేందర్‌రెడ్డికి ఇబ్బందిగా మారుతోందని టాక్. దృవలోని కొన్ని సన్నివేశాల్ని చూసిన చిరు.. పెదవి విరిచారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ”టేకింగ్ స్టైలింగ్ గా ఉంది.. కానీ..” అంటూ చిరు కొన్ని సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
చిరు ప్రస్తుతం తన 150వ సినిమాతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అయినా సరే.. చరణ్ సినిమాలపై ఫోకస్ తగ్గలేదు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గానే ఉన్నాడట. ఇటీవలే ఫస్టాఫ్ మొత్తం చూసిన చిరు కొన్ని కరెక్షన్స్ చెప్పాడని టాక్. సురేందర్‌రెడ్డిని పర్సనల్‌గా పిలిచి మాట్లాడాడని, ‘స్టైలింగ్ కంటే కంటెంట్ అవసరం’ అని సలహా కూడా ఇచ్చాడని చెప్పుకొంటున్నారు. మరి… వాటిని సూరి ఎలా రిసీవ్ చేసుకొంటాడో చూడాలి. మేకింగ్ విషయంలో ‘తని ఒరువన్’లో ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అయిపోమని సురేందర్‌రెడ్డికి చరణ్ ముందే హింట్ ఇచ్చాడట. ఇప్పుడు చిరు వెర్షన్ మరోలా ఉందని.. ఇద్దరి మధ్య తాను నలిగిపోతున్నాని సన్నిహితుల దగ్గర సురేందర్ రెడ్డి చెప్పుకొంటున్నట్టు తెలుస్తోంది.