చిరంజీవి గాడ్ ఫాదర్ విడుదలైయింది. సెట్స్ పై బాబీ, మెహర్ రమేష్ సినిమాలు వున్నాయి. పైప్ లైన్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. అందులో వెంకీ కుడుముల సినిమా ఒకటి. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. చిరంజీవి స్టామినాకు సరిపోయేలా ఓ పవర్ఫుల్ కథాంశాన్ని వెంకీ సిద్ధం చేశారు. ఇటివలే కథకి చిరు ఆమోదముద్ర కూడా పడింది.
అయితే ఇప్పుడీ సినిమాకి నిర్మాత రూపంలో ఒక సమస్య వచ్చింది. చిరంజీవి, వెంకీ కుడుముల సినిమాకి దానయ్య నిర్మాత అనుకున్నారు. అయితే ఇప్పుడీ సినిమా దానయ్య చేతి నుండి పక్కకు జరిగింది. ప్రభాస్ మారుతి సినిమాకి కూడా దానయ్యే నిర్మాత. కానీ ఆఖరి నిమిషంలో ఏమైయిందో కానీ ఆ సినిమా కూడా దానయ్య చేజారింది. వెంకీ చెప్పిన ఫైనల్ వెర్షన్ నేరేషన్ చిరంజీవి చాలా నచ్చింది. మంచి రోజు చూసి ప్రకటించాలని భావించారు. ఇప్పుడీ సినిమాకి నిర్మాత కావాలి. నిర్మాత కుదిరిన వెంటనే అధికారికంగా ప్రకటన చేస్తారు.