బింబిసార తరవాత దర్శకుడు వశిష్ట చిరంజీవికి ఓ కథ చెప్పడం, విశ్వంభర సెట్స్‌పైకి వెళ్లడం ఓ కలలా అయిపోయాయి. నిజంగా ఇదో క్రేజీ కాంబో. సోషియో ఫాంటసీ సినిమా కావడం, త్రిష కథానాయికగా రావడం.. ఇవన్నీ హైప్ తీసుకొచ్చాయి. కానీ అదేంటో.. మెల్లమెల్లగా ఈ సినిమా క్రేజ్ హరించుకుపోయింది. టీజర్ విడుదల చేస్తే, అందులో వీఎఫ్ఎక్స్ తేలిపోయాయి. అమీర్ పేట గ్రాఫిక్స్ అంటూ మెగా ఫ్యాన్స్ పెదవి విరిచారు. సంక్రాంతికి రావాలనుకొన్న సినిమా, గేమ్ చేంజర్ కారణంగా ఆగిపోయింది. వేసవికి వస్తుందో రాదో తెలీదు. గ్యాప్ ఎలాగూ వచ్చింది కాబట్టి, వీఎఫ్ఎక్స్ పై మళ్లీ వర్క్ చేస్తారని అనుకొన్నారు. అంత టైమ్ కూడా నిర్మాణ సంస్థ చేతుల్లో వుంది.
కానీ… అలాంటి ప్రయత్నాలేం జరగలేదు. వీఎఫ్ఎక్స్ విషయంలో నిర్మాణ సంస్థ కొత్తగా ఖర్చు పెట్టింది కూడా లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. యూవీ క్రియేషన్స్ చాలా ఇబ్బందుల్లో వుంది. తమ పెట్టుబడి అంతా ఈసినిమాపైనే పెట్టింది. ఈ సినిమా మార్కెట్ జరిగితే మిగిలిన సినిమాలు మొదలెట్టాలని చూసింది. కానీ ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడవ్వలేదు. దాంతో పెట్టుబడి టైట్ అయిపోయింది. నిజంగా ఓటీటీ ముందే అమ్మేస్తే, ఆ డబ్బుల్లో కొంత వీఎఫ్ఎక్స్పై రీ వర్క్ చేసుకోవడానికి ఖర్చు పెట్టేవారు. కానీ అది జరగలేదు. కాబట్టి గ్రాఫిక్స్ విషయంలో మార్పులు లేవు. ఒకవేళ ఓటీటీ డీల్ క్లోజ్ అయినా ఇప్పటికిప్పుడు గ్రాఫిక్స్ మార్చే అవకాశం లేదు. ఎందుకంటే గ్రాఫిక్స్ తో పని పెట్టుకొంటే అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. ఓటీటీ డీల్ అయిపోతే, దానికి అనుగుణంగా రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకోవడమే మిగిలింది. టీజర్లో ఎఫెక్ట్స్ చూసి ఇబ్బంది పడ్డ మెగా ఫ్యాన్స్ సినిమాలోని జిమ్మిక్కులు చూసి ఏమంటారో మరి