అక్కినేని అవార్డు తీసుకుంటున్న సమయంలో చిరంజీవి తన లెజెండ్ వివాదం గురించి ప్రస్తావించారు. ఇప్పుడు తాను ఆ లెజెండ్ పురస్కారానికి అర్హుడినేనన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. మోహన్ బాబు కూడా ఏదో అన్నారని చెప్పుకుంటున్నారు. అయితే చిరంజీవికి లెజెండ్ అనే బిరుదు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన పని లేదు. ఆయన ఖచ్చితంగా లెజెండే. రాజకీయాల్లోఆయన విఫలమవ్వొచ్చు కానీ సినిమాల వరకూ ఆయన తిరుగులేని లెజెండ్.
మోహన్ బాబుది ఈర్ష్య మాత్రమే !
సినీ వజ్రోత్సవాల సమయంలో చిరంజీవికి లెజెండ్ అవార్డు ప్రకటించడం పట్ల మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో చిరంజీవి నొచ్చుకున్నారు. అందుకే తన అవార్డును కాలమానికలో వేశారు. మోహన్ బాబుది అప్పటికి ఈర్ష్యనే. ఆయనే తనకు ఇవ్వాలని అడగలేదు కానీ.. చాలా మంది పేర్లు చెప్పారు. ఆయన మనస్థత్వం అప్పట్లో తనకు కాకపోతే ఇంకెవరూ లెజెండ్ కాకూడదనే. ఇప్పటికీ ఆయన మారలేదు. కానీ పరిస్థితులు మారాయి. చిరంజీవి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ మోహన్ బాబు మాత్రం పాతాళంలోకి పడిపోయారు.
పద్మవిభూషణుడు లెజెండా కాదా ?
చిరంజీవి దేశ సినీ రంగంలో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన బాక్సాఫీస్‌కు మాత్రమే మొత్తం సినీ రంగం వృద్ధికి ఎంతో చేశారు. ప్రేక్షకులు సినిమాలపై ఆసక్తి పెంచుకోవడానికి ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్ చిన్నది కాదు. ఆయన లెజెండరీ యాక్టర్ అనే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు రావు. మోహన్ బాబు లాంటి వ్యక్తులు చేసే అభ్యంతరాలకు అసలు విలువే ఉండదు. అలాంటి వారి గురించి పట్టించుకోవడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు అనే వ్యక్తి ఏ విషయంలోనూ ప్రథముడు కాదు.. కనీసం టాప్ వందలో కూడా ఉండరు. ఆయన నటిస్తే చూసేవాళ్లు కూడా లేరు. ఒక్క టిక్కెట్ కూడా అమ్ముడుపోని నటుడు తనను తాను లెజెండ్‌తో సమానంగా పోల్చుకోవడం. హాస్యాస్పదమే.
అసలా చర్చకు చాన్సే ఇవ్వకూడదు !
ఇక నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి అయినా మరో చోట అయినా చిరంజీవి లెజెండా కాదా అన్న అంశంపై చర్చకు తావివ్వకూడదు, దురదృష్టవశాత్తూ చిరంజీవి తో పాటు ఆయనకు సంబంధించిన వారే ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు, గుర్తుచేస్తున్నారు. లెజెండ్ అనే దానికి ఎవరూ ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి అర్హత కూడా ఎవరికీ లేదు ఎందుకంటే ప్రజలే ఎప్పుడో ఇచ్చారు. ఇలాంటి చర్చను రానివ్వకపోవడమే లెజెండ్ మెగాస్టార్‌కు ఇచ్చే గౌరవం.