ఈ అక్టోబరు 5న మూడు సినిమాలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్, ఘోస్ట్, స్వాతిముత్యం విడుదలకు రెడీ అయ్యాయి. మూడు సినిమాల ప్రమోషన్లూ జోరుగా సాగుతున్నాయి. ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ వేడుకలో… `నా సినిమాతో పాటు చిరంజీవిగారి సినిమా కూడా అదే రోజు విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలూ బాగా ఆడాలని కోరుకుంటున్నా` అని తనకు అత్యంత ఆప్తుడు చిరంజీవి సినిమా ని విష్ చేశాడు నాగార్జున. ఈ విషయంలో చిరు అభిమానుల మనసుల్ని నాగ్ గెలుచుకొన్నాడు. అయితే స్వాతి ముత్యం పేరెత్తడం మర్చిపోయాడు. పనిలో పనిగా.. స్వాతిముత్యం సినిమానీ యాడ్ చేసి, శుభాకాంక్షలు అందజేస్తే సరిపోయేది. స్వాతి ముత్యం టాపిక్ లేకపోయే సరికి, చిన్న సినిమాలు నాగ్ కంటికి కనిపించవా? అంటూ విమర్శకులు ఓ రేంజ్లో రెచ్చిపోయారు.
ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకలు అనంతపురంలో జరిగాయి. ఈ సందర్భంగా చిరు తన సినిమాతో పాటు విడుదల అవుతున్న ది ఘోస్ట్ కీ, దాంతో పాటు స్వాతిముత్యం సినిమాకీ శుభాకాంక్షలు అందజేశాడు. మూడు సినిమాలూ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకొన్నాడు. అలా.. చిరు నాగ్ చేసిన తప్పు… తాను చేయకుండా కవర్ చేసుకొన్నాడు. అందుకే కదా… చిరుని అందరి వాడూ అనేది. అంత వర్షంలోనూ.. అన్ని విషయాలూ పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకొని, విమర్శకులు తనని టార్గెట్ చేయకుండా చూసుకోగలిగాడు.