ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి చాలా చికాకుగా వుంటున్నట్టు సన్నిహిత వర్గాల కథనం. ఇందుకు చాలా సంఘటనలు ఉదాహరణగా చెబుతున్నారు గాని మరీ డిటైల్స్ అనవసరం. చిన్న కూతురు పెళ్లి సంతోషం వున్నా మరెందుకు చిరు ఇంతగా దిగాలు పడిపోతున్నారంటే రెండు కారణాలంటున్నారు
బ్రూస్లీ ప్లాప్ కావడం ఆ కుటుంబాన్ని చాలా క్రుంగదీసిందన్నది తెలిసిన విషయమే. ప్లాప్ కావడం ఒకటైతే ఆ రేంజ్లో దెబ్బతింటుందని వూహించలేకపోయామే అన్నది మరో విచారం. ఇలాటి సమయంలోనే పులి మీద పుట్రలా వరుణ్ తేజ్‌ను పరిశ్రమలో కొందరు కావాలని పైకి లేపుతున్నారని డౌటు పెరిగిపోయింది. నాగబాబు తనయుడికి కూడా పెద్ద హిట్లు లేకున్నా క్లాస్ యాక్టర్ అంటూ కితాబులిచ్చేయడం,, రెమ్యూనరేషన్ కూడా పెంచేయడంతో మెగా కీర్తిలో మెగా వాటా పోతుందా అనే సందేహం పెరిగింది. మరో వారసుడు సాయి ధరమ్ తేజ్‌తో గ్యాంగ్ లీడర్ పేరు అనౌన్స్ చేయడం అతనికి బిరుదులు తగిలించడంతో మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేక గొడవ సృష్టించారు కూడా. ఆ కుర్రాడు కూడా ఒకింత జాగ్రత్త పడాలని తెలుసుకున్నాడు. ఇదంతా ఆ పిల్లల తప్పు లేదా వారి తలిదండ్రుల తప్పు కాదనీ పరిశ్రమలో కొందరు వ్యతిరేకులు కావాలని తన బిడ్డను తక్కువ చేయడానికే ఇలా చేస్తున్నారని చిరు కలత చెందారట. దాన్ని దూరం చేయడానికే పవన్ కళ్యాణ్ పనికట్టుకుని వచ్చి ఓదార్పి వెళ్లాడని చెబుతారు.
అయితే పవర్ స్టార్ పైనా ఫిర్యాదులు లేవనుకుంటే పొరబాటే. తను చాలా రోజులుగా నటించకపోవడం వల్ల తన అభిమానులంతా తమ్ముడికి షిప్ట్ అయిపోయారని అన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. తమ్ముణ్ని చూసి మొదట ముచ్చట పడ్డాను, తర్వాత సంతోష పడ్డాను, ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాను అని మొదట్లో చిరంజీవి అనేవారు. ఇప్పుడు అజాగ్రత్త వల్ల నష్టపోయాననే భావం పెరిగిపోయింది. దీన్ని పోగొట్టగల వారెవ్వరు? ఏదైనా పెద్ద సక్సెస్ రావాలి. రావాలంటే సినిమా తీయాలి. తీయాలంటే కథ దర్శకుడు తేల్చుకోవాలి. అది వాయిదా వేస్తూ విచారించడం వేస్టే కదా?