మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా `లూసీఫర్`. తెలుగులో `గాడ్ ఫాదర్` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడు. మోహన్ రాజా దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ఊటీలో ప్రారంభమైంది. ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు నుంచి దాదాపు రెండు వారాల పాటు నిరంతరాయంగా షెడ్యూల్ కొనసాగే అవకాశంఉంది. చిరు సెట్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి. మలయాళం `లూసీఫర్`ని తెలుగు ప్రేక్షకుల అభిరుచి, చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ఈ చిత్రంలో మరో కథానాయకుడికీ చోటుంది. అయితే అది అతిథి పాత్ర. ఆ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపిస్తాడని ఓ ప్రచారం. అయితే… చిత్రబృందం ఈ విషయంపై స్పందించడం లేదు. కేవలం రెండు మూడు రోజుల కాల్షీట్లు ఇస్తే చాలు. ఆ పాత్ర రెడీ అయిపోయింది. సినిమా చివర్లో ఆ సీన్లు తీసుకున్నా ఓకే. అందుకే ఈ పాత్ర విషయంలో చిత్రబృందం ఏమాత్రం తొందర పడడం లేదు. ఈ చిత్రంలో చిరు గెటప్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వైవిధ్యంగా కనిపించబోతున్నాయని టాక్.