కాంగ్రెస్ ఎంపి చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకు త్వరలో వివాహం జరుగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారి వివాహ విషయం చిరంజీవి కుటుంబ సభ్యులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఆ కారణంగానే చిరంజీవి కుమార్తె పెళ్లి గురించి, పెళ్లి కొడుకు గురించి మీడియాలో అనవసరమయిన ఊహాగానాలు చాలా వచ్చేయి. వాటన్నిటికీ ముగింపు పలుకుతున్నట్లుగా శ్రీజ తనకు కాబోయే భర్త కనుగంటి కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటో, వరుడి వివరాలు సోషల్ మీడియాలోకి వచ్చేసాయి. వరుడు శ్రీజకు ఒకప్పటి క్లాస్ మేట్. అతను దుబాయ్ లోని బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అతని తల్లి తండ్రుల పేర్లు కెప్టెన్ కృష్ణ, జ్యోతి. వారి కుటుంబం బంగారు నగల ఆభరణాల బిజినెస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీజ మొదటి వివాహం విఫలం అవడం, ఆమెకు మొదటి భర్త ద్వారా ఒక పాప పుట్టిన సంగతి ఆమెకు కాబోయే భర్త కళ్యాణ్ కి, అతని తల్లి తండ్రులకి కూడా తెలుసు. ఆ సంగతి తెలిసిన తరువాత వారు ఈ వివాహానికి అంగీకరించినట్లు సమాచారం. వచ్చే నెలలో శ్రీజ, కళ్యాణ్ ల వివాహం జరుగవచ్చునని తెలుస్తోంది.