చిరంజీవి కొత్త సినిమా ‘విశ్వంభర’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. మారేడుమిల్లిలో ఓ షెడ్యూల్ చేశారు. చిరంజీవి లేకుండానే షూటింగ్ మొదలెట్టారు. ఇప్పుడు ‘విశ్వంభర’ సెట్లో చిరంజీవి తొలిసారిగా అడుగు పెట్టబోతున్నాడు. ఈనెల 18 నుంచి భీమవరం పరిసర ప్రాంతాల్లో ‘విశ్వంభర’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో చిరు పాలు పంచుకోబోతున్నారు. భీమవరం దొరబాబు పాత్రలో చిరు కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర.. వింటేజ్ చిరుని గుర్తు చేయబోతోందని టాక్.
త్రిషని ఓ కథానాయికగా ఎంచుకొన్నారు. ఇందులో మరో నలుగురు హీరోయిన్లు ఉంటారు. వాళ్లలో చిరు మరదలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ఆసక్తిని కలిగిస్తోంది. మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉంది. ఈ షెడ్యూల్ లో మరదలు పాత్ర కూడా ఎంట్రీ ఇవ్వాలి. ఆ ప్లేసులో ఎవరు కనిపిస్తారన్న విషయంలో ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. రానా ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.