కొరటాల శివ ఆచార్య లాంటి మెగా ఫ్లాఫ్ ఇస్తాడని ఫ్యాన్స్ కలలో కూడా ఊహించి వుండరు. కొరటాల పై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. బ్లాక్ బస్టర్ మాట పక్కన పెడితే కనీసం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాడని అనుకున్నారు. కానీ దారుణమైన ఫలితం వచ్చింది. కొరటాల ఇచ్చిన షాక్ తో ఇప్పుడు మెగా లైనప్ ఫాన్స్ లో టెన్షన్ పట్టుకుంది. మెగాస్టార్ మూడు సినిమాలు సెట్స్ పై వున్నాయి. ఇందులో రెండు రీమేకులు. కథ పరంగా ఓకే. ఒక బాషలో ఆదరించిన కథలే. ఐతే అది ఇక్కడ హిట్టు అవ్వాలనే రూలు లేదు. పైగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాకి మెగా పల్స్ ఎలా పట్టుకుంటాడో అనే భయం వుంది అభిమానుల్లో.
ఇక భోళా శంకర్ చేస్తున మెహర్ రమేష్ ని చాలా మంది మర్చిపోయారు. అలాంటి మెహర్ కి సినిమా అప్పగించాఋ చిరు. మెహర్ ఇచ్చే అవుట్ పుట్ పై కూడా ఒక డౌటు. మూడో సినిమా బాబీది. ఇది వరిజినల్ కథే. ఐతే వచ్చిన సమస్య.. బాబీకి అనుభవం సరిపోవడం లేదని టాక్. మెగాస్టార్ ఇప్పటికే బాబీ సినిమాపై కొంచెం అసంతృప్తిగా వున్నారని తెలిసింది. మెగా పల్స్ పట్టుకోవడంలో బాబీ తడబాడు కనిపిస్తుందని ఇన్ సైడ్ టాక్. బాబీ గత సినిమా వెంకీ మామ. అదే కాకుండా పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తో ఇంకో మెగా ఫ్లాఫ్ వుంది. ఇవన్నీ మెగా అభిమానులని కలవరపెడుతున్న విషయాలే.