మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల పద్మ విభూషణ్ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కార ప్రదానోత్సవం రేపు ఢిల్లీలో జరగబోతోంది. ఈ సందర్భంగా చిరు ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటుగా సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కూడా ఈ వేడుకలో పాలు పంచుకోనున్నారు. దేశంలోని రెండో అత్యుత్తమ పురస్కారం పద్మ విభూషణ్. తెలుగు చిత్రసీమలో పద్మ విభూషణ్ ఇద్దరు మాత్రమే అందుకొన్నారు. నిజానికి తెలుగు చిత్రసీమ అంతా కలిసి చిరుకి ఓ సన్మాన కార్యక్రమం జరపాలనుకొంది. అయితే అదెందుకో వాయిదా పడుతూ వస్తోంది. కనీసం `మా` అయినా ముందుకొచ్చి ఓ ఈవెంట్ నిర్వహించాల్సింది. అది కూడా ఆలస్యమైపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సెగలు కక్కుతున్న ఈ తరుణంలో చిరు పద్మ విభూషణ్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా మించి పోయిందేం లేదు. చిరు పద్మ విభూషణ్ అందుకొన్న తరవాతైనా, ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించొచ్చు. కానీ…దాన్ని ముందుకు నడిపించే శ్రద్ద – ఆసక్తి ఎవరికి ఉంది?