సరైనోడు సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈనెల 22న విడుదల అవ్వడానికి రెడీగా ఉంది. అయితే.. ఈ సినిమా గురించి ఇప్పుడో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సరైనోడు రీషూట్ జరుగుతోందని, కొన్ని సన్నివేశాల్ని మార్చి తీరుస్తున్నారని టాక్. ఇటీవలే చిరంజీవి సరైనోడు సినిమాని ప్రత్యేకంగా చూసి బోయపాటికి కొన్ని మార్పులు చెప్పారట. మరీ హెవీ యాక్షన్ ఉంది.. డైలాగులు కూడా ఓవర్‌గా ఉన్నాయి, డోసు తగ్గించమని చెప్పారట. దాంతో బోయపాటి శ్రీను వెంటనే రంగంలోకి దిగారని టాక్. మరోవైపు ఈ సినిమాకి సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ జారీ చేశారని,దాన్ని యు బై ఏ గా మార్చడానికి రీషూట్ అవసరమైందని చెప్పుకొంటున్నారు.
అయితే… ఈ విషయాన్ని సరైనోడు టీమ్ ముందుకు తీసుకెళ్తే… ”అబ్బే.. రీషూట్లేం లేవు. కానీ.. రీ సెన్సార్ చేయిస్తాం..” అంటోంది. రీషూట్లు లేనప్పుడు ఈ రీ సెన్సార్ ఎందుకో.?? సరైనోడు సినిమాలోని సన్నివేశాల డోసు తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతోందన్నది వాస్తవం. అది రీ షూట్ చేశా, లేదంటే.. సన్నివేశాల్ని ట్రిమ్ చేశా.? అన్నది మాత్రం తేలాలి. రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అంజలి ప్రత్యేక గీతంలో కనిపించనుంది. పాటలు ఆల్రెడీ మాస్‌కి బాగా నచ్చేశాయి. ఇక తెరపై ఎలా ఉంటాయో చూడాలి.