చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాత్రీ పగలూ 150వ సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు చిరు. జులై 12 వరకూ విరామం లేకుండా ఏకధాటిగా షూటింగ్ జరగబోతోంది. అయితే ఇప్పటి వరకూ హీరోయిన్ ఎవరన్నది తేలలేదు. నయనతార ఇంతకు ముందే `నో` చెప్పింది. దాంతో అనుష్క ఖాయమనుకొన్నారు. స్వీటీ కూడా చిరుతో కలసి నటించడానికి ఉత్సాహం చూపించింది. అయితే ఎందుకనో చివరి క్షణాల్లో అనుష్క పేరు కూడా పక్కన పెట్టేశారు. దీనంతటికీ కారణం చిరంజీవి అని తెలుస్తోంది. చిరు నిర్ణయం మేరకే అనుష్క పేరు పక్కన పెట్టారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.
అనుష్క క్రేజ్.. ఆమె గ్లామర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కొత్తతరం కథానాయికలెంతమంది వచ్చినా… అనుష్కనే నెంబర్ వన్. అయితే.. ఈమధ్య స్వీటీ బాగా లావైపోయింది. సైజ్ జీరో కోసం 20కిలోలు పెరిగిన స్వీటీ.. ఆ తరవాత బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అవేం ఓ కొలిక్కి రావడం లేదు. కేవలం బరువు సమస్యే అనుష్కని చిరు 150వ సినిమాకి దూరం చేసిందని టాక్. చిరు బాగా ఒళ్లు చేశాడు. అయినా ఈమధ్య 10 కిలోలు తగ్గాడట. ఆయన పక్కన అనుష్క మరీ లావుగా కనిపిస్తుందని, కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వదన్నది చిరు ఆలోచన. అందుకే అనుష్క ఈ సినిమాకి దూరమైందట.