మలయాళంలో మోహన్‌లాల్ నటించిన చిత్రం `లూసీఫర్`. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో తీసిన సినిమాల్లో ఇదొకటి. ఫృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తూ, ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మలయాళంలో మంచి విజయాన్ని అంకుంది. తెలుగులో డబ్ అయినా సరిగా ఆడలేదు. ఈ సినిమాని చిరంజీవి, చరణ్ లు కలిసి రీమేక్ చేస్తారని వార్తలొచ్చాయి. సైరా ప్రమోషన్లలో భాగంగా ఫృథ్వీరాజ్ సమక్షంలోనే చిరంజీవి `లూసీఫర్` రీమేక్ విషయాన్ని ప్రస్తావించాడు కూడా.
అయితే లూసీఫర్ రీమేక్ విషయంలో చిరంజీవి పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా మలయాళ వెర్షన్ చిరంజీవికి బాగా నచ్చింది. ఈ విషయాన్ని ఎన్వీ ప్రసాద్లో చర్చిస్తుంటే.. ఆయన ఆఘమేఘాల మీద `లూసీఫర్` రీమేక్ రైట్స్ కొనుక్కొచ్చేశార్ట. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను చర్చించుకుంటే మాత్రం – మన తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం ఇలాంటి సినిమాలు నప్పవన్న విషయం క్లియర్ కట్‌గా అర్థమైందట. అంతే కాదు.. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదలైందని, అది రెండు రోజులకు మించి ఆడలేదన్న విషయం చిరు గుర్తించి – లూసీఫర్ ని రీమేక్ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పాపం.. చిరుపై నమ్మకంతో ఎన్వీ ప్రసాద్ రీమేక్ రైట్స్‌ని మంచి రేటుకి కొనుక్కొచ్చేశారు. చిరు కాదంటే.. ఈ సినిమా కోసం మరో హీరోని వెదుక్కోవాలేమో..?