చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్రసీమతో మమేకం అవుతుంది. చిరు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా సేవలు అందించింది. ఇప్పుడు నిర్మాతగానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ వెబ్ సిరీస్ కి శ్రీకారం చుట్టింది. ఆనంద్ రంగ ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు. ఓయ్‌తో.. పరిచమయ్యాడు ఆనంద్ రంగ. ఆ తరవాత.. టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు ఓ స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అది వెబ్ సిరీస్ కి అనువుగా ఉండడంతో.. సుస్మిత ప్రొడక్షన్ లో దీన్ని పట్టాలెక్కించారు. ఇదో థ్రిల్లర్ అని తెలుస్తోంది. వెబ్ సిరీస్‌లలో విజయవంతమైన జోనర్ ఇది. అయితే తెలుగులో మంచి థ్రిల్లర్లు రావడం లేదు. ఆ లోటుని తీర్చేలా.. ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందట. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయని ఒక్కోక్క ఎపిసోడ్ నిడివి 30 నుంచి 40 నిమిషాల లోపు ఉంటుందని తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో బయటకు వస్తాయి.