మెహర్ రమేష్ తో `వేదాళం` సినిమా రీమేక్ చేయాలని ఫిక్సయ్యాడు చిరంజీవి. ఇప్పటికే స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఒకే ఒక్క సిట్టింగ్ లో.. చిరు మెహర్ రమేష్ కథని ఓకే చేసేశాడు. ఒక్క కరక్షన్ కూడా చెప్పలేదని టాక్. అయితే.. చిరు మెహర్ కి ఒకే ఒక్క సూచన చేశాడట. ఓ అంకె చెప్పి, ఆ అంకెలోనే సినిమా పూర్తి చేయాలని గీత గీశాడట. ఆ బడ్జెట్లోనే సినిమా పూర్తి చేయాలన్నది చిరు ఆర్డర్.
మెహర్ దగ్గర ఉన్న అలవాటేంటంటే.. ప్రతీ సీన్ రిచ్ గా డిజైన్ చేయడం.స్టైలీష్ మేకింగ్ అంటూ హడావుడది చేయడం. అలాంటప్పుడు బడ్జెట్ గీతలు దాటుతుంటుంది. బిల్లా, షాడో సినిమాలు అనుకున్న బడ్జెట్‌ని దాటి తీసినవే. ఆ పొరపాటు ఈ సినిమాలో జరక్కూడదన్నది చిరు ఉద్దేశం. పైగా.. భారీ కాస్టింగ్ మోజుతో స్టార్ల వెంట పడకుండా, అందుబాటులో ఉన్న నటీనటుల్నే ఎంచుకోవాలని చిరు సూచించాడట. ఆచార్య, లూసీఫర్ రీమేక్‌లతో పోలిస్తే.. వేదాళం రీమేక్‌కి తక్కువ బడ్జెట్ కేటాయించినట్టు టాక్. ఈ చిత్రానికి చరణ్ నిర్మాత కాదు. అయినా సరే, చిరు ఈ జాగ్రత్త తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమే.