సినిమా అంటే పాత్రల సమాహారం. కొన్ని చిత్రవిచిత్రమైన పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ. అంతే! `చిత్రలహరి` చూస్తే.. అలాంటి సినిమానే రాబోతోందనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కిషోర్ తిరుమల దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మించింది. నాలుగు పాత్రల మధ్య జరిగే కథ ఇది.
మగాళ్లంతా ఒకేలా ప్రవర్తిస్తారు అనుకునే ఓ అమ్మాయి
తన క్యారెక్టర్‌పై తనకే క్లారిటీ లేని ఇంకో కన్ఫ్యూజ్ అమ్మాయి
తనది అనుకుంటే పైసా కూడా వదలని పర్ఫెక్ట్ ఫెలో
పేరులో విజయం ఉన్నా జీవితంలో విజయం లేని ఓ దురదృష్టవంతుడూ..
ఇదీ `చిత్రలహరి`లో పాత్రల తీరుతెన్నులు.
సుకుమార్ వాయిస్ ఓవర్‌తో మొదలై.. చివరి వరకూ ఆసక్తికరంగా, సరదాగా సాగిపోయింది టీజర్. డైలాగులు, సినిమాటోగ్రపీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఇవన్నీ `చిత్రలహరి`కి కలిసొస్తాయని టీజర్ చెప్పకనే చెబుతోంది. ఎన్నాళ్ల నుంచో సాయిధరమ్ తేజ్ ఓ హిట్టు బాకీ పడిపోయాడు. అది ఈ సినిమా తీరుస్తుందన్న నమ్మకం కలుగుతోంది. ఏప్రిల్ 12న థియేటర్లలో చిత్రలహరిని చూడొచ్చు. ఈ పాత్రల గురించి ఇంకాస్త క్లియర్‌గా తెలుసుకోవచ్చు.