పుంగనూరులో జరిగిన అల్లర్ల వ్యవహారంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. మొత్తం వైసీపీ నేతలతో కలిసి ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ కోసం గుడ్డలు చించుకుని మరీ పని చేస్తారని విమర్శలు ఎదుర్కొంటున్న రిషాంత్ రెడ్డి.. ఈ ఘటన జరిగిన తర్వాత ఇచ్చిన ప్రెస్ నోట్, మీడియాతో మాట్లాడిన అంశాను చూస్తే.. ఆయన చెప్పినట్లుగా పక్కా ప్లాన్ తోనే దాడులు జరిగాయని.. వైసీపీతో కలిసి పోలీసులే చంద్రబాబు కాన్వాయ్ పై దాడులకు కుట్ర చేశారన్న అనుమానాలు సహజంగా ఎవరికైనా వస్తాయి.
ఎమ్మెల్యేను చంద్రబాబు ” రావణ ” అన్నారని వైసీపీ నేతలు ప్రొటెస్ట్ చేశారట !
తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లు అనే గ్రామం వద్ద టీడీపీ నేతలపై ఎన్ని సార్లు దాడులు జరిగాయో లెక్కే లేదు. అలాంటి సున్నితమైన చోట.. రాడ్లు, రాళ్లు, కర్రలతో వందల మంది కార్యకర్తలు చంద్రబాబు వచ్చే ముందు గుమికూడారు. దీనికి చిత్తూరు ఎస్పీపెట్టిన పేరు నిరసన వ్యక్తం చేయడం. అంతకు ముందు చంద్రబాబు వేరే చోట మాట్లాడుతూ తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అన్నారని అందుకు నిరసనగా వారంతా అక్కడ గుమికూడారని చెప్పుకొచ్చారు. వారు అలా రాళ్లు, రాడ్లు, కర్రలతో నిరసన వ్యక్తం చేస్తూంటే పోలీసులు రక్షణ కల్పించారని ఆయన ఉద్దేశమన్నమాట.
అంగళ్లులో చంద్రబాబుపై రాళ్లదాడి కూడా నిరసనగా చెబుతున్న ఎస్పీ
అంగళ్లులో చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు రాళ్ల దాడి జరిగింది. పోలీసులు సహకరించకపోతే రాళ్లు వేసేంత దగ్గరగా వైసీపీ కార్యకర్తలు రాలేరు. ఈ ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల చేతకానితనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక లాభం లేదని చంద్రబాబు రాళ్లు వేస్తున్న వైసీపీ కార్యకర్తల్ని తరమాలని పిలుపునిచ్చారు. దాంతో టీడీపీ కార్యకర్తుల వెంటపడటంతో పోలీసులు పరారయ్యారు. డీఎస్పీ వ్యవహారశైలిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వజ్ర వాహనం ముందస్తుగా తెచ్చి పెట్టడం వెనుక కుట్ర లేదా ?
చంద్రబాబు పర్యటన ప్రతీ చోటా సాగిపోయింది. వైసీపీ నేతలు రెచ్చగొట్టాలని .. దాడులు చేయాలనుకున్న చోటే ఉద్రిక్తంగా మారుతోంది. పుంగనూరులో పోలీసులు ఈ కుట్రలో భాగం అయ్యారు. అంగళ్లు నుంచి చంద్రబాబు పుంగనూరులోకి రాకుండా లారీలు, బస్సులు, వజ్ర వాహనాన్ని అడ్డం పెట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం తెచ్చుకున్నారు. ఇదే విషాయన్ని రిషాంత్ రెడ్డి చెబుతున్నారు. అక్కడ అడ్డం పెడితే ఘర్షణలు సృష్టించవచ్చని ముందుగానే గుర్తించి.. పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, వజ్ర వాహనంతో వచ్చారు. టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల్ని బలి చేస్తున్న రిషాంత్ రెడ్డి !
రాజకీయ నాయకులకు కొమ్ము కాయడం కోసం ఎస్పీ రిషాంత్ రెడ్డి పోలీసుల్ని బలి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలు సేఫ్ గా తప్పించుకున్నారు. కానీ అల్లర్లలో ఎక్కువగా గాయపడింది పోలీసులే. ఈ వ్యవహారం జరగక ముందే .. సజ్జల ..తాడేపల్లిలో మాట్లాడిన మాటలను.. రిషాంత్ రెడ్డి..మీడియా ముందు వినిపించారు. ప్లాన్ ప్రకారం చూస్తూంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి ఇదంతా చేసినట్లుందన్న అనుమానాలు బలపడుతున్నాయి.