‘తంగలాన్‌’ .. ఇది విక్రమ్ కేజీఎఫ్

కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో గని కార్మికుల జీవితాల చుట్టూ తిరిగే సంఘటనల ఆధారంగా ప్రశాంత్ నీల్ తీసిన ‘కేజీఎఫ్’ సంచలనం సృష్టించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా హీరోయిజాన్ని పీక్స్ లో చూపిస్తూ బాక్సాఫీసుని షేక్ చేసింది. అయితే ఇప్పుడు అదే నేపధ్యంలో దర్శకుడు పా రంజిత్ విక్రమ్ హీరోగా ‘తంగలాన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదలై ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ గురించి ఒక్క మాటలలో చెప్పాలంటే టెర్రిఫిక్ అనాలి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ వరల్డ్ కి దీనికి పొంతన లేదు. కేజీఎఫ్ లో కమర్షియల్ హీరోయిజం చూపిస్తే,., పా రంజిత్ మాత్రం,, ఆ గనుల్లోని మూలాలకు వెళ్లి వొళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తీసినట్లు టీజర్ చూస్తే అర్ధమౌతుంది. టీజర్ బిగినింగ్ లో పాముని ముక్కలు చేసిన సన్నివేశం ఊహాతీతంగా వుంది. అలాగే విక్రమ్ మేకోవర్ అన్ బిలివబుల్ అని చెప్పాలి. గుర్తుపట్టలేనంత వింతగా మారిపోయారు. మొత్తానికి టీజర్ మంచి అంచనాలు పెంచింది. ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

  1. People should reject. Too much violence. Movies. Children are spoiling indirectly. And also ban movies like. Baby. Good for children

Comments are closed.