కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ చేసింది. జాతీయ ఆవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించగా.. పరిశీలించిన రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది.
జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 2019లో ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో హోటల్ లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది.
కెరీర్ నాశనం అవుతుందని, అవకాశాలు రావని విషయం ఎవరికీ చెప్పలేదని, అయితే అప్పటి నుంచి దీనిని అవకాశంగా తీసుకొని జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు రానురాను మరింత ఎక్కువ కావడంతో జానీ మాస్టర్ టీం నుంచి బయటకు వచ్చేశానని, అయినా తనను సొంతంగా పని చేసుకోనివ్వడకుండా ఇబ్బందులు పెడుతున్నాడని బాధితురాలు పేర్కొంది.
ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.కాగా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఇటీవల జానీ మాస్టర్ జాతీయ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అవార్డుల ప్రధానోత్సవంకు హాజరయ్యేందుకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.