నృత్య దర్శకులుగా పేరు వచ్చాక… దర్శకులుగా పేరు తెచ్చుకోవాలని కొంతమంది సినిమా కెప్టెన్ కుర్చీలోకి షిఫ్టయ్యారు. తెలుగులో ప్రభుదేవా, రాఘవా లారెన్స్, అమ్మ రాజశేఖర్… హిందీలో ఫరా ఖాన్, రెమో డిసౌజా, అహ్మద్ ఖాన్, గణేష్ ఆచార్య… మొదలుగు కొరియోగ్రాఫర్లు మెగాఫోన్ పట్టారు. త్వరలో ఈ జాబితాలో గణేష్ మాస్టర్ పేరూ చేరుతుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వ ప్రయత్నాల్లో వున్నట్టు సమాచారం.
నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్, నితిన్ తదితర హీరోలకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఆయనకు పాపులార్టీ తెచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాలో టైటిల్ సాంగ్ కొరియోగ్రఫీకి అవార్డులు వచ్చాయి. ఈ కొరియోగ్రాఫర్ కెప్టెన్ కుర్చీకి షిఫ్టయ్యే ప్రయత్నాల్లో వున్నారు. ఇప్పటికే కథ సిద్ధం చేశాడట. తెలుగులో ఇద్దరు ముగ్గురు హీరోలు, అగ్ర నిర్మాతలతో గణేష్ మాస్టర్ చర్చల్లో వున్నారు. రెండు మూడు నెలలకు హీరో, నిర్మాత విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి.