తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంజూ యాదవ్ తో పాటు మొత్తం ఐదుగురు సీఐలపై వేటు వేసింది. వీరంతా ఎన్నికల్లో విధుల్లో వైసీపీకి సహకరించాలే ప్రత్యేకంగా ఓ గ్రూపుగా మారి రెగ్యూలర్ గా టచ్ లో ఉండి.. వైసీపీ నేతల ఆదేశాల మేరకు పన చేస్తున్నట్లుగా ఆధారాలతో సహా విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు.
మహిళా సీఐ అంజూయాదవ్ ఎన్నో సార్లు వివాదాస్పదమయ్యారు. పొలిటికల్ గా మంత్రి పెద్దిరెడ్డి ప్రాపకం కోసం ఆమె ఎంతకైనా దిగజారుతారన్న విమర్శలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో పని చేస్తున్పప్పుడు ఓ టీడీపీ సానుభూతిపరాలైన మహిళపై.. ఆమె నిర్వహిస్తున్న హోటల్ వద్దనే చేసిన దౌర్జన్యకాండ.. మహిళ చీర లాగేసిన వైనం సంచలనం సృష్టించింది. ఆ వీడియోలు వరైల్ కావడంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని అనుకున్నారు. కానీ ఏ చర్యలు తీసుకోకపోగా ఆమెక ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలోనే పోస్టింగ్ ఇచ్చారు.
మరో నలుగురు సీఐలతో కలిసి తిరుమలలో పని చేస్తున్న సీఐ ఒకరు పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీకి అనుకూలంగా పని చేస్తూ వస్తున్నారు. చివరికి పోలింగ్ కు ముందు వీరి వల్ల వచ్చే ముప్పును గుర్తించిన ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల్ని ఈసీ హెచ్చరిస్తోంది. అయితే కొంత మంది ప్రణాళికలు వేరే ఉండటంతో ఇలాంటి ఆఫీసర్లు ఇంకా విధుల్లో ఉన్న చోట ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడింది.