అమెరికన్ నిఘా సంస్థ సీఐఏ భారతదేశంలో ఓ కొత్త వివాదాన్ని సృష్టించింది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంస్థలను హిందూ ఉగ్రవాదల సంస్థలుగా సీఐఏ తేల్చింది. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిణామాలను అధ్యయనం చేసి… “వరల్డ్ ఫ్యాక్ట్ బుక్” పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. దీనిలో .. భారత దేశంలో రెండు ప్రముఖ హిందూ సంస్థలుగా పేరున్న వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ చోటు దక్కించుకున్నాయి. ఇవి అత్యంత ప్రమాదకమైన హిందూ భావజాలంతో కూడిన రాజకీయాలు చేస్తూంటాయని సీఐఏ అభిప్రాయపడింది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా… వాటి మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాలపై తీవ్రంగా ఒత్తిడి తెస్తూంటయని..సీఐఏ తెలిపింది.
వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌లు సీఐఏ చెప్పినట్లుగా.. హిందూ ఉగ్రవాద సంస్థలు అవునో కాదో చెప్పలేము కానీ.. ఇతర అంశాలన్నింటినీ కరెక్ట్‌గానే నివేదికలో పొందు పరిచారు. ఎక్స్ట్రీమ్ .. హిందూయిజంను ప్రదర్శించడంలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఎప్పుడూ ముందు ఉంటాయి. జనవరి ఒకటి, ప్రేమికుల రోజు లాంటి సందర్భాల్లో భజరంగ్‌దళ్ చేసే విన్యాసాలు టెర్రర్ పుట్టిస్తూంటాయి. అడ్డుకోవడానికి అధికారవర్గాలు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. గతంలో ఉగ్రవాదం అంటే… అదేదో .. ముస్లింలకు సంబంధించినదన్నట్లుగా ఉండేది. కానీ మక్కా మసీదు, మాలేగావ్ పేలుళ్ల వెనుక ఉన్నది హిందూ ఉగ్రవాదులన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. కోర్టుల్లో నిలబడకపోయినా… వీటిపైన ప్రజల్లో అనుమానాలున్నాయి.
సహజంగా ఎవరైనా మతపై చెడ్డ ముద్ర వేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తారు. ఐసిస్ అయినా సరే.. తాము తీవ్రవాదులం కామని చెప్పుకుటుంది. సహజంగనే.. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కూడా.. ఆమెరికాపై మండి పడుతున్నాయి. తాము ఎలా ఉగ్రవాద సంస్థలుగా కనిపించామని ఆగ్రహంతో ర్యాలీలు ప్రారంభించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. ఏమని అన్నా.. సీఐఏ.. తను అనుకున్నదే చెబుతుంది. దానికే కట్టుబడి ఉంటుంది. దానికి వీహెచ్‌పీకి, భజరంగ్దళ్కి పోయేదేమీ ఉండదు. కానీ వారిపై అనుమానమేఘాలు మాత్రం ఏర్పడతాయి.