సజ్జల రామకృష్ణారెడ్డి అనే కుట్రల సలహాదారు… వైసీపీలో తాను తప్ప ఎవరూ మేధావి కాదనుకుంటారు. జగన్ రెడ్డి తరపున ఆయనే మీడియా ముందు మాట్లాడుతూంటారు. తెర వెనుక షాడో సీఎంగా వ్యవహరిస్తూంటారు. ఆధారాలు లేని తప్పుడు కేసులు పెట్టడంలో ఆయనే సూత్రధారి అని అందరికీ తెలిసిన విషయం. ఇటీవలి కాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలు విని అందరూ పగలబడి నవ్వుతున్నారు. పిచ్చి ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరిపోయిందని సెటైర్లు వేస్తున్నారు. అలా ఆయన మాట్లాడిన మాటతో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చాలా మేలు జరిగింది. జగన్ రెడ్డి సర్కార్ కు ఝులక్ వచ్చింది.
ఇటీవల నిమ్మగడ్డ రమేష్ సిటిజన్స్ ఫర్ డెమెక్రసీ అనే పేరుతో ఓసంస్థను ఏర్పాటు చేశారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై పోరాడుతున్నారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారన్న కారణంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల వివరాలు… ప్రైవేటు కంపెనీలకు చేరి అక్కడ్నుంచి వైసీపీ నేతలకు చేరి.. ఇతర పార్టీల సానుభూతిపరుల్ని వేధించడం.. తప్పుడు కేసులు పెట్టడం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలి కాలంలోఏపీలో ఎఫ్ఐఆర్లు వేల కొద్దీ నమోదవుతున్నాయని వాటి సంగతి తేల్చాలంటున్నారు.
వీటిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నిమ్మగడ్డ తరపున ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ వాదిస్తున్నారు. ఆయన కాస్ట్ లీ లాయర్ అని… ఆయనకు కోట్లు ఇవ్వడానికి నిమ్మగడ్డకు డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. సజ్జల ఇలా మాట్లాడారని తెలిసిన వెంటనే.. సిబల్ వైపు నుంచి రెస్పాన్స్ వచ్చింది. నిమ్మగడ్డకు సిబల్ ఉచిత సర్వీస్ ఇస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కపిల్ సిబల్ ఎప్పుడూ రెడీగా ఉంటారన్నారు. అంటే.. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని సిబల్ ద్వారా… సజ్జల అందరికీ చెప్పించినట్లయింది.