ప్రభుత్వాన్ని విమర్శించిన.. ప్రశ్నించిన పోస్టుకే సీఐడీ అధికారులు కేసులు.. అరెస్టులతో హడావుడి చేస్తున్నారు. కానీ అత్యున్నతమైన న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విపక్షపార్టీలు..ఆ పార్టీల నేతల కుటుంబసభ్యులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్న విషయాన్ని ఆ పార్టీ నేతలు… సీఐడీకి వాట్సాప్ ద్వారా అదే పనిగా ఫిర్యాదులు పంపుతున్నా పోలీసులు లైట్ తీసుకుంటున్నారు. ఇదే పంధాను.. హైకోర్టు విషయంలోనూ.. పాటిస్తూండటమే…న్యాయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
దీంతో.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు పనిచేస్తోందని.. న్యాయమూర్తులను అగౌరపరిచేలా సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతున్నారు.. అసభ్య పదజాలం వాడుతున్న వారిపై కోర్టు ధిక్కరణ కింద..శిక్షించాలని కోరుతూ.. వీవీ లక్ష్మినారాయణ అనే న్యయవాది హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. సుమోటోగా ఆర్డర్ పాస్ చేయాలనికోరారు. కోర్టుల గౌరవాన్ని కాపాడటంతో పాటు దాడులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నవారి.. వాట్సాప్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలను లేఖలో లక్ష్మీనారాయణ వివరించారు. ఆయా పోస్టుల స్క్రీన్ షాట్లను కూడా…సాక్ష్యాలుగా సమర్పించారు. మూడు రోజులుగా… హైకోర్టుపై… అధికార పార్టీ సానుభూతిపరులైన కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కోర్టుల్ని కించ పరిచేలా ఉండటంతో… ఇతరులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.