సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెడుతున్న పోస్టుల విషయంలో సీఐడీ పోలీసులు అనుసరిస్తున్న వైఖరి మరోసారి వివాదాస్పదమయింది. గుంటూరుకు చెందిన పూంతోట రంగనాయకమ్మ అనే వృద్ధురాలు.. తన ఫేస్బుక్ పేజీలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం..ఆ తర్వాత పరభుత్వం తీసుకున్న చర్యలపై స్పందిస్తూ వ్యక్తం చేసిన అనుమానాలను షేర్ చేశారు. సీఐడీ అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేశారో లేక.. వారే సొంతంగా ఆలోచించారో కానీ… సీఐడీ సీఐ నేరుగా..గుంటూరులోని రంగనాయకమ్మ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని నోటీసులో పేర్కొన్నారు. అదేదో అవార్డు ఇస్తున్నట్లుగా.. పోలీసులు ఆమెకు నోటీసులు ఇస్తూ..చక్కని ఫోటో తీసుకున్నారు. ఆ కేసు విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వెంటనే..పోలీసుల తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్చలేదా అంటూ.. విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఆమె వృద్ధురాలు కావడం… పెట్టిన పోస్టు కూడా ఆమె సొంతంగా రాసింది కాకపోడంతో సీఐడీ పోలీసుల తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అందర్నీ కేసుల పేరుతో బెదిరించి..నోరెత్తకుండా చేయాలనుకుంటుందోందని.. ఆమె షర్ చేసిన పోస్టును తామంతా షేర్ చేస్తామని..టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తుల.. ఆ పోస్టును వైరల్ చేశారు. రంగనాయకమ్మను టీడీపీ నేతలంతా పరామర్శించారు. హైదరాబాద్‌లో లోకేష్ ఫోన్ చేసి.. న్యాయపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఓ వైపు పన్నెండు మృతికి కారణం అయి..కొన్ని వందల మంది తీవ్ర అనారోగ్యానికి గురి చేసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ఐదు వందల రూపాయల ఫైన్‌తో పోయే కేసులు పెట్టి…ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై సీఐడీ కేసులు పెట్టడం ఏమిటని సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు.. సోషల్ మీడియా స్వేచ్చను అపరిమితంగా ఉపయోగించుకుని లబ్ది పొందిన వైసీపీ నేతలు ఇప్పుడు… ప్రతి ఒక్కరిని నియంత్రించాలనుకోవడం ఏమిటని టీడీపీ నేతలంటున్నారు.