కేసీఆర్ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన అధికారి సోమేష్ కమార్కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయనపై జీఎస్టీ కేసు ఇంతకు ముందే నమోదు అయింది. అయితే నోటీసులు ఇవ్వడంలో ఆలస్యం అయింది. తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసిది. తప్పుడు ఇన్వాయిస్లతో రూ. 1400 కోట్లు వాణిజ్య పన్నుల శాఖకు రావాల్సిన ఆదాయాన్ని కొట్టేయడంలో సోమేష్ కుమార్ పాత్ర కీలకమని సీఐడీ గుర్తించింది.
వస్తువులు సరఫరా చేయక పోయినా చేసినట్లు, ఫేక్ ఇన్వాయిస్లను సఅష్టించి రిటర్న్స్ క్లయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎగవేత కోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు.. ప్లాయంటో టెక్నాలజీస్ అనే కంపెనీలు కలిసి .. సోమేష్ సాయంతో ఈ స్కామ్ చేసినట్లుగా గుర్తించారు.
ఈ స్కామ్ లో నగదు రికవరీ చేయడం కీలకంగా మారింది. కేసు నమోదు చేసి రెండు, మూడు నెలలు అవుతున్నప్పటికీ నోటీసులు జారీ చేయడానికి సమయం తీసుకున్నారు. ఈ లోపు మొత్తం ఈ కేసులో వివరాలన్నీ బయటకు తీసినట్లగా చెబుతున్నారు. ముందుగా సోమేష్ కు నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకుని సంతృప్తిగా లేకపోతే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.