ఏపీలో సీఐడీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి ఒక్కరి వెంటా పడుతోంది. అసలు పెట్టిన కేసుల్లో చార్జీషీటు వేయకపోయినా విచారణ పేరుతో కేసులు నమోదు చేసిన వారిని టార్చర్ పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది. గతంలో నమోదైన కేసులో టీవీ5 జర్నలిస్టు మూర్తిని విచారణకు పిలిచింది సీఐడీ. విచారించుకోవచ్చని హైకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఇక అడ్డు లేదనుకుంది. అలాగే పిలిచింది. మూర్తి విజయవాడ కూడా వచ్చారు. ఇక విచారణకు హజరవుతున్నారని టీవీ5లోనూ ఉదరగొట్టారు. కానీ చివరికి మూర్తి సీఐడీ ఆఫీస్ వైపు వెళ్లలేదు.
మూర్తి విచారణను రికార్డు చేయాలని.. లాయర్ సక్షంలోనే ప్రశ్నించాలని న్యాయస్థానం చెప్పింది. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ముందుగా వెళ్లిన లాయర్ గుర్తించి.. వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం వాదనలు వింటామని తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే సీఐడీ పోలీసులు మూర్తి లాయర్‌కు ఫోన్ చేసి.. సీసీ కెమెరాలు పెట్టామని విచారణకు రావాలని కోరారు. అయితే విషయం కోర్టుకెళ్లింది కాబట్టి కోర్టులో తేల్చుకుంటామని చెప్పేశారు మూర్తి లాయర్.
మంగళవారం హైకోర్టులో విచారణ తర్వాత మూర్తి .. సీఐడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో యూనివర్శిటీల్లో నియమించిన పాలక మండలి సభ్యులకు సంబంధించి ఓ వార్తను ప్రసారం చేశారు. నోట్ ఫైల్‌ను మూర్తి స్క్రీన్ పై చూపించారు. అది చోరీ చేశారని మూర్తిపై కేసు పెట్టారు. ఆ కేసులో గతంలో చాలా సార్లు విచారణకు హాజరయ్యారు. ఇంకా సాగదీస్తున్నారు.