చైతన్య రథం తెలుసా అంటే.. తెలుసని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త చెబుతారు… చైతన్య రథం చదివారా అంటే.. టీడీపీ కార్యకర్తల్లోనే చాలా మందికి తెలియదు. చదవడమేమిటి అనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలియనుంది. చైతన్యరథం ను చదవాలనే ఆసక్తి ఏర్పడనుంది. ఈ క్రెడిట్ సీఐడీ అధికారులకే దక్కుతుంది.
తెలుగుదేశం పార్టీ చైతన్యరథం పేరుతో ఓ పత్రిక నడుపుతోంది. అది ఆన్ లైన్ ఎడిషన్. పార్టీ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ లో ఉంటుంది. అయితే ఆ పత్రికను చదివేవారు తక్కువ. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచి కంటెంట్ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ఆ పత్రికను ఎందుకు ఫేమస్ చేయడం లేదని.. ప్రజల్లోకి పంపాలని.. టీడీపీ కార్యకర్తలు చదివేతే ఏం ఉపయోగమన్ని బాధపడుతూ ఉంటారు. అయితే ఆ పత్రికను ప్రజల్లోకి పంపేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ బాధ్యతను ఏపీ సీఐడీ తీసుకుంది.
మంగళవారం రోజు ఏపీసీఐడీ అధికారులు టీడీపీ ఆఫీసుకు వెళ్లారు. చైతన్యరథం ఎడిటర్ ఎవరని.. అందులో వస్తున్న కథనాలకు బాధ్యలెవరని ప్రశ్నించారు. వివరాలు చెప్పాలని నోటీసులు ఇచ్చి వెళ్లారు . ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. చాలా మందికి చైతన్యరథం అనే పత్రిక ఉందా అని ఇప్పుడే తెలిసింది. అసలు అందులో ఏం రాస్తున్నారో అనే క్యూరియాసిటీ … సీఐడీ అధికారులు కల్పించారు. వారు.. వివరాలు చెప్పాలని నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఇప్పటికే చైతన్యరథం గురించి మీడియాలో కూడా విస్తృత ప్రచారం జరిగింది.
ఇక టీడీపీ పత్రికలో వచ్చిన కథనాలను చూపించి ఒకటి, రెండు అరెస్టులు కూడా చేస్తే.. ఇక పత్రికకు తిరుగు ఉండదని ఆ పార్టీ నేతలు జోకులేసుకుంటున్నారు. పత్రికకు మంచి పబ్లిసిటీ తెచ్చి పెట్టినందుకు సీఐడీకి ధ్యాంక్స్ చెబుతున్నారు.