చిట్స్ వేసి పాడుకుని.. డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన వారిని తీసుకొచ్చి.. మార్గదర్శి మోసం చేసిందని కేసులు పెట్టిస్తున్నారు సీఐడీ అధికారులు. ఇలాగే గతంలో ఓ సారి తప్పుడు ఫిర్యాదు తీసుకుని … విజయవాడ పోలీస్ కమిషనర్ ఏకంగా తన ఆఫీసులోనే ఫిర్యాదు దారుడ్ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ కోర్టు ఇచ్చిన షాక్ తో మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు సీఐడీ అదే పని చేసింది. ఓ మహిళను తీసుకొచ్చి ఆమె ఫిర్యాదు చేసిందని చెప్పి కేసు పెట్టారు. ఆమె ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు చూస్తే.. మార్గదర్శిది తప్పేమీ లేదని.. అందరికీ అర్థమవుతుంది. సీఐడీ కుట్ర చేస్తోదని ఆమె మాటలు విన్న వారికి అర్థమవుతుంది.
అన్న పూర్ణ అనే మహిళ పౌల్ట్రీ ఫాం వ్యాపారం చేస్తున్నారు. ఆమె మొదట తన ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా చిట్స్ వేశారు. తర్వాత ఇష్టం వచ్చినట్లుగా చిట్స్ వేశారు. కడతానని చెప్పి కనీసం 90 చిట్స్ వేశారు. ఈ విషయం ఆమె చెప్పారు. డబ్బులు కట్టలేక 17 చిట్స్ లో డీఫాల్ట్ అయ్యారు. చిట్స్ పాడుకున్న తర్వాత ష్యూరిటీలు ఇచ్చి నగదు తీసుకున్నారు. కానీ కట్టడం మానేశారు. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి ఆమె చేతులెత్తేయడంతో ష్యూరిటీ సంతకాలు పెట్టిన వారి దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు. ఈ విషయాలు కూడా ఆమె చెప్పారు. ఇది తప్పెలా అవుతుందో సీఐడీ అధికారులు చెప్పాల్సి ఉంది.
ఆమె కుమార్తె సంతకాలు ఫోర్జరీ చేసి.. చిట్ పాడారని.. ఆమె విదేశాల్లో ఉందని ఇలాంటి కబుర్లు చెప్పారు. కేసులు పెట్టామన్నారు. ఆమె పూర్తిగా చిట్ వ్యవహారాల్లో డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన విషయం ఆమె చెబుతున్నప్పుడు .. మోసం చేసింది ఆమే అవుతుంది కానీ మార్గదర్శి ఎలా అవుతుందన్న చిన్న లాజిక్ సీఐడీ పోలీసులకు రాలేదు. ఏదో విధంగా తప్పుడు ప్రచారాలు చేయడానికి.. ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకు వస్తే వారికి రాచమర్యాదలు చేయడం కామన్ అయిపోయింది. ఇదే ప్రెస్మీట్ లో ఇంకా చాలా ఆరోపణలు చేశారు సీఐడీ సంజయ్. వాటిని ఎందుకు కోర్టు ముందు పెట్టలేకపోతున్నారో మాత్రం చెప్పలేదు.