వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు అందగా..తాజాగా మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణ దాస్ పై సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో వీరి విషయం తేల్చాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు.
వైసీపీ పాలనలో చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని ,నిధులను పక్కదారో పట్టించారని కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆర్ డీ ప్రసాద్ మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణ దాస్ లపై జూన్ లోనే ఫిర్యాదు చేశారు.
ఆడుదాం ఆంధ్రాపై విచారణ జరిపి , వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలంటూ తాజాగా సీఐడీ అధికారులు ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరూ మాజీ మంత్రులపై కేసు నమోదు కానుంది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు వరుసగా కేసులు ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్, పెద్దిరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీతోపాటు పలువురు కేసులు ఎదుర్కొంటున్న వేళ ఇప్పుడు రోజా , ధర్మాన కృష్ణ దాస్ ల వంతు వచ్చిందని టాక్ నడుస్తోంది.