రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నాడని ఆయనను అరెస్టు చేస్తాం పర్మిషిన్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. వినడానికే కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొర్టు తోసిపచ్చింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను నారా లోకేష్ ఉల్లంఘించారని సీఐడీ తెలిపింది. చంద్రబాబు కేసు దర్యాప్తు అధికారులను రెడ్‌బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తు్న్నారని సీఐడీ తెలిపింది. దర్యాప్తు అధికారులను జైలుకి పంపిస్తామన్న లోకేష్ ప్రకటనలపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
రెడ్‌బుక్ పేరుతో చేస్తున్న ప్రకటనలు సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరింది. సాక్ష్యాలు ఏమిటని అడిగితే.. పత్రికల క్లిప్పింగ్‌లను సీఐడీ తరపు లాయర్లు చూపించారు. కాసేపటి తర్వాత ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లుగా కోర్టుకు తెలిపింది. రాజకీయ కారణాలతో తప్పుడు కేసులు పెట్టిన… టీడీపీ కార్యకర్తల్ని వేధించిన అధికారులందరి పేర్లను రెడ్ బుక్‌లో రాసుకుంటున్నామని ప్రత్యేకంగా కక్ష సాధింపుల శాఖను తనే చూసుకుంటానని నారా లోకేష్ చెబుతూ వస్తున్నారు.
రెడ్ బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో.. లోకేష్ చెప్పలేదు. ప్రత్యేకంగా ఫలానా అధికారి అని చెప్పలేదు. తప్పుడు కేసులు పెట్టిన వారిని మాత్రమే అని చెబుతున్నారు. అయినా పేపర్ క్లిప్పింగులు ఆధారంగా సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు వెళ్లి.. నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయాలని కోరడం విస్మయం వ్యక్తమయింది. చివరికి సీఐడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.