రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి సర్కార్ అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు మొదలుకొని సామాజిక వర్గ సంఘాలు మొదలుకొని తటస్థ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఈ సంఘటనపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతకంటే విస్మయం కలిగించే సంఘటన మరొకటి జరిగింది. వివరాల్లోకి వెళితే..
కస్టడీలో ఉన్న తనను పోలీసులు కొట్టారని రఘురామ కృష్ణంరాజు జడ్జికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తన కాళ్లకు ఉన్న గాయాల ని రఘురామకృష్ణంరాజు జడ్జికి సైతం చూపించారు. రఘు రామకృష్ణంరాజు కు నిన్న లేని గాయాలు కాళ్లపై ఇవాళ ఎలా వచ్చాయని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఇది నిజమని నిరూపణ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది. రఘు రామ కృష్ణంరాజు గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గాయాల కారణంగా రిమాండ్ కు న్యాయస్థానం నిరాకరించింది.
మరొకవైపు కస్టడీలో ఉన్న వ్యక్తి ని కొట్టడం తప్పని, రఘురామ కృష్ణం రాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఖండిస్తున్నాను అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక ఎంపీ పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు ప్రకటన జారీ చేశారు. అయితే సాక్షి ఛానల్ లో మాత్రం రఘురామకృష్ణంరాజు నాటకం ఆడుతున్నారని, కోర్టు చేరుకునే వరకు రఘురామకృష్ణంరాజు బాగానే ఉన్నారని, అయితే బెయిల్ డిస్మిస్ కావడంతో కొత్త నాటకానికి రఘురామకృష్ణరాజు తెరలేపారని విజువల్స్ తో ఒక కథనాన్ని ప్రసారం చేసింది సాక్షి.
ఏదిఏమైనా రఘురామకృష్ణంరాజు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.