సీఐడీ చీఫ్గా ఉంటూ తప్పుడు కేసులో విపక్ష నేతల మీద విరుచుకుపడిన సీఐడీ చీఫ్ సంజయ్ అమెరికా పారిపోవాలనుకున్న ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఆయనకు నెల రోజులు సెలవు మంజూరు చేస్తూ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సీఎస్ జవహర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు రావడంతో .. తర్వాత ఏం జరుగుతుందని అనుకున్నారో కానీ.. వెనక్కి తగ్గారు. సెలవు రద్దు చేసుకుంటూ లేఖ తీసుకున్నారు సెలవులు రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు.
మార్గదర్శి విషయంలో కానీ.. చంద్రబాబుపై తప్పుడు కేసుల విషయంలో కానీ సీఐడీ చేసిన అతి అంతా ఇంతా కాదు. చిన్న ఆధారం లేకపోయినా గాలి పోగేసి కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఇప్పుడు వీరందరి లెక్కలు తేల్చకుండా ఉండే అవకాశం లేదు. ప్రమాణస్వీకారం చేయక ముందే అన్ని వివరాలను రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడిన అధికారులు తెరపైకి వస్తున్నారు. సమాచారాన్ని టీడీపీ నేతలకు చేర వేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లని విధంగా టీడీపీ నేతల్ని పోలీసులు వేధించారు. అందులో ఓ ఎస్పీ జాషువా. ఆయన టీడీపీ నేతల్ని పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పట్టాభిని పోలీస్ స్టేషన్ లో పెట్టి ధర్డ్ డిగ్రీ ఇచ్చారు. ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చేందుకు పట్టాభిప్రయత్నం చేశారు. పట్టాభి వస్తున్నారని తెలియడంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్చాఫ్ చేశారు.