చంద్రబాబుపై తాము పెడుతున్నది తప్పుడుకేసులేనని.. స్వయంగా సీఐడీనే సాక్ష్యాలు ఇస్తోంది. మద్యం అక్రమాలు అంటూ… సీఐడీ నమోదు చేసిన కేసులో కోర్టు ముందు పెట్టిన పత్రాలు చూసి…. అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఫైల్స్‌పై ఎక్కడా లేని చంద్రబాబు సంతకాలు లేవు. ప్రివిలేజ్ ఫీజ్ రద్దు చేసి షాపులకు లబ్ధి కలిగించారని … డిస్టిలరీలకు ఆయాచిత లబ్ధి కలిగించారని కేసులు పెట్టారు. కానీ చంద్రబాబు ముందస్తు బెయిల్ సమయంలో సీఐడీ దాఖలు చేసిన పత్రాల్లో ఎక్కడా చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా ఆధారాలు లేవు.
ప్రివిలేజ్ ఫీజ్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఫైల్ అసలు చంద్రబాబు వద్దకు వెళ్లలేదని సీఐడీనే కోర్టుకు పత్రాల ద్వారా తెలిపింది. ప్రివిలేజ్ ఫీజ్ రద్దు ఫైల్‌పై కిందిస్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు బహిర్గతం అయిది. ఎస్పీవై డిస్టిలరీకి చెల్లించాల్సిన వడ్డీపై లీగల్ ఒపీనియన్ కోసం న్యాయశాఖకు పంపి నిర్ణయం తీసుకోవాలని ఫైల్‌పై రాశారు చంద్రబాబు. దీనిపై లీగల్ ఓపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ సీఐడీ కోర్టుకు ఇచ్చిన సాక్ష్యాలు.
అంతే కాదు అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రభుత్వానికి నష్టం జరగలేదని కాగ్ కూడా రిపోర్టు ఇచ్చింది. ఇవన్నీ తెలిసినా ఏదో జరిగిపోయిందని ఊహించుకుని సీఐడీ కేసు పెట్టింది. దీనిపై న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందో కానీ ఇలా కూడా కేసులు పెట్టే చాన్స్ ఉందని… దాన్ని కోర్టుల వరకూ తీసుకెళ్లవచ్చని నిరూపిస్తున్నారు. రేపు ఇదే పరిస్థితి వైసీపీకి వస్తుంది.. అప్పుడు అసలు నొప్పి తెలుస్తుందని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే… ఇలాంటి తప్పుడు కేసులకు దెబ్బలు తిన్న వాళ్లు.. అట్టుకు అట్టున్నర చేస్తారు మరి!