నారాయణ ఫ్యామిలీపై పెట్టిన కేసుల్లో అందరికీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్చి 6, 7, 8 న సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని నారాయణతో పాటు ఆయన భార్య కుమార్తెలు, అల్లుళ్లకు సీఆర్పీసీ 41 నోటీసులు జారీ చేశారు. నారాయణపై సీఐడీ పలు విచిత్రమైన కేసులు పెట్టింది. రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేశారని.. బినామీల పేరుతో కొన్నారని ఆరోపించారు. కానీ ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. బినామీలెవరో సీఐడీ చెప్పడం లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అట్రాసిటీ కేసు పెట్టారు.
తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారు. అసలు అంగుళం భూ సేకరణ కూడా జరగలేదు. అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలేమిటో తెలియదు కానీ కేసు పెట్టేశారు. ఈ కేసులోనూ నోటీసులు జారీ చేశారు. ఇక అసలు టెన్త్ పేపర్ లీక్ కాలేదని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించి.. టెన్త్ పేపర్ లీకేజీ కేసు పెట్టారు. అసలు ఆ లీకేజీకి.. నారాయణకు సంబంధం ఏమిటంటే… ఓ కింది స్థాయి ఉద్యోగితో వాంగ్మూలం తీసుకున్నారట. నారాయణే లీకేజీ చేయమని ఆదేశాలిచ్చారని.
ఈ కేసుల పేరుతో నారాయణ ఇంట్లో గుర్తొచ్చినప్పుడల్లా సోదాలు చేసిన అధికారులు.. ఇప్పుడు నోటీసులు జారీ చేశార. ఇటీవల సోదాలు చేసినప్పడుల్లా.. అనేక రకాల ప్రచారాలు చేశారు. ఆడియో క్లిప్పులని చెప్పుకొచ్చారు. ఈ నోటీసులపై నారాయణ … న్యాయస్థానానికి వెళ్తారా.. సీఐడీ ఎదుట హాజరవుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.