స్కిల్ డెలవప్మెంట్ స్కాం అంటూ మూడు రోజులుగా హడావుడి చేస్తున్న సీఐడీ అధికారుల స్కిల్ నవ్వుల పాలయింది. విమానం టిక్కెట్లు పెట్టుకుని నోయిడాకు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకు వచ్చిన భాస్కర్ అనే ఉద్యోగికి రిమాండ్ విధించడానికి కోర్టు నిరాకరించింది. ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ఇప్పటికి ఆరు సార్లు ఆ భాస్కర్ ను ప్రశ్నించారని.. కొత్తగా ఏం కనిపెట్టారని కోర్టు ప్రశ్నించడంతో సీఐడీ అధికారులు నీళ్లు నమిలారు. దాంతో భాస్కర్ ను వదిలి పెట్టాలని.. ఏమైనా ప్రశ్నించాలనుకుంటే 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.
మరో వైపు టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో పని చేసిన ఆర్జా శ్రీకాంత్ ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆయన అసలు స్కిల్ లో స్కాం లేదని రిపోర్టు ఇచ్చారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం వేరే నివేదిక ఇచ్చింది. అందులో నోట్ ఫైల్ లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని రాశారు. దానిపై ప్రశ్నిస్తే.. నోట్ ఫైల్ ఉందని స్పష్టం చేసినట్లుగా సమాచారం . దీంతో సీఐడీ అధికారులు హుటాహుటిన వెళ్లి స్కిల్ ఫైల్స్ వెదికారు. నోట్ ఫైల్ దొరకడంతో నాలిక్కరుచుకున్నారు. ఏం చేయాలో తెలియక… ఏమీ లేని చోట బొక్కలు వెదుకుతున్నామని చెప్పుకోలేక మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పి శ్రీకాంత్ ను పంపేశారు.
అసలు స్కాం ఏమిటి అంటే… డబ్బులు ఇతర ఖాతాలకు మళ్లాయని బ్లూ మీడియా ప్రచారం చేస్తుంది. ఒక్క రూపాయి అయినా ఇలా మళ్లి ఉంటే ఆధారాలు చూపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ సీఐడీ అధికారులు ఇందులో స్కామ్ చూపించేంత స్కిల్ తమకు ఉందని నిరూపించుకోలేకపోతున్నారు. ఓ వ్యక్తి ఈగోను శాటిస్ ఫై చేయడానికి లేని స్కాంను చూపించడానికి తంటాలు పడుతున్న సీఐడీ అధికారుల వ్యవహారాలు ఇప్పుడు నవ్వుల పాలవుతున్నాయి.